Paradise Papers Leak effect To JAGAN : పాదయాత్ర ఆపేసిన జగన్ | Oneindia Telugu

2017-11-08 1

Appleby’s records show details of financial transactions related to Nimmagadda Prasad, an industrialist from Andhra Pradesh who was arrested in May 2012 as an accused in one of the clutch of cases filed by the CBI against YSR Congress Chief, Y S Jagan Mohan Reddy
పారడైజ్ పేపర్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అంశం వెలుగు చూసింది. దీనిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. దేశంలో ఏ కుంభకోణం బయటపడినా జగన్ పేరు బయటకు రావడం ఆనవాయితీ గా మారిందన్నారు. దీనివల్ల ఏపీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని, పెట్టుబడులపైనా ప్రభావం చూపిస్తోందని చంద్రబాబు అన్నారు. మంగళవారం టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ సందర్ఫంగా ఆయన మాట్లాడారు. జగన్‌ పాదయాత్రకు ప్రజా స్పందన అనుకున్న దాని కంటే తక్కువగానే ఉందని పార్టీ నేతలు ఈ సందర్భంగా చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. పారడైజ్‌ పత్రాల విషయంలో సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. అందుకే సోమవారం నాటి పాదయాత్ర త్వరగా ముగించారని నేతలు.. చంద్రబాబుతో చెప్పారు. దానికి చంద్రబాబు స్పందిస్తూ.. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని చెప్పారు.